Erst Medal Dist TRT 2017 Provision Selected List and Press Note By DEO

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం సంగారెడ్డి జిల్లా , కేంద్రము : సంగారెడ్డి

పత్రిక – ప్రకటన

తేది : 10 . 07 . 2019

Download

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉపాధ్యాయ నియామక ప్రక్రియ TRT - 2017 సంబంధించి , ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ , భాషా పండితులు మరియు వ్యాయామ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది . ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్ , సంగారెడ్డి గారు చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది . స్కూల్ ఎడ్యుకేషన్ , డైరెక్టరేట్ వారి కాలనిర్ణయ పట్టిక ప్రకారం , తేది : 10 . 7 . 2019 నాడు TRT - 2017 లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం , సంగారెడ్డి నందు నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుంది . అదేవిధంగా , జిల్లా విద్యాశాఖ కార్యాలయ వెబ్సైట్ www . deosangareddy . com నందు పొందుపరచడం జరిగింది . ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ లో కాల నిర్ణయ పట్టిక ప్రకారం పొందుపరచడం జరుగుతుంది . ఉపాధ్యాయులు లేని పాఠశాలలు , బాలికల పాఠశాలలు మరియు

అత్యధిక విద్యార్థులు పాఠశాలకు నియామక ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఎంపిక కాబడిన అభ్యర్థులు

వారి ఒరిజినల్ ధ్రువపత్రాలతో తేది : 12 . 7 . 2019 నాడు ఉదయం 9 గంటల నుండి విద్యాశాఖ కార్యాలయం , సంగారెడ్డి లో జరుగు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి . నియామక ప్రక్రియ , జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ద్వారా తేది : 14 . 7 . 2019 నాడు కలెక్టర్ గారి కార్యాలయంలోని ఆడిటోరియంలో ఉదయం 10 : 00 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది . తదనంతరం , ఉపాధ్యాయ నియామక పత్రాలు పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులు తేది : 15 . 7 . 2019 ఉదయం నుండి ఎంపిక చేసుకున్న పాఠశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది .

జిల్లా
సంగారెడ్డి

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts